31 May, 2026 | 10:08 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

సీపీఐ ‘ఇంటింటికీ’ కార్యక్రమం ప్రారంభం

08-04-2026 12:17 AM

మొయినాబాద్ ఏప్రిల్ 7(విజయ క్రాంతి): సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి కార్యక్రమం మొయినాబాద్ మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమైంది. మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎం. ప్రభులింగం, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వడ్ల మంజుల, భారతీయ కిసాన్ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, సజ్జన్పల్లి అధ్యక్షుడు సించట్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సిపిఐ పార్టీ గ్రామ గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఇంటిని సందర్శించి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు.  ఇండ్ల స్థలాలు, పింఛన్లు వంటి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసిన పార్టీగా సిపిఐను కొనియాడారు.  తూర్పాటి నరసింహులు, ఎండి జలీల్, బిక్షపతి, బాలమణి, సిద్దయ్య, ఎండి జాంగీర్, పూరిపాటి నరసింహులు, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.