ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ
గుమ్మడిదల, ఏప్రిల్ 7: ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుమ్మడిదల మునిసిపాలిటీలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్థానిక మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, కమీషనర్ దశరథ్, వైద్యాధికారి డాక్టర్ ఎస్.మధుకర్ పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉందని తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాలలో ర్యాలీలు, సభలు నిర్వహించి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఎంఈఓ పౌలీన, ఏ ఈ ప్రవీణ్ మరియు కౌన్సిలర్లు మురళి, కిషన్, కత్తుల రమేష్, నాయకులు హుస్సేన్ వెంకట్రాంరెడ్డి, పి.రాజు, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు, మధు, మంద భాస్కర్ రెడ్డిలు, ఆరోగ్య సిబ్బందిలో ఎమ్మెల్ హెచ్ పి లు కళ్యాణి, భాగ్య, రేవంత్, సభా ఆఫ్రీన్, శ్రీనివాస్, హెచ్ ఈ ఓ శ్రీలక్మి, సూపర్వైజర్, ఏఎన్‌ఎంలు స్వరూప, వసంత, వసుంధర, శశికళ, మణెమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
గజ్వేల్‌లో..
గజ్వేల్, ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ఆర్.ఎం.వో డాక్టర్ రాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. అన్ని దానాల కంటే ప్రాణదానం మిన్న అని పేర్కొన్నారు. శిబిరంలో మొత్తం 32 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ తరపున వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కుమార్ స్వామి, ఆర్.ఎం.వో డాక్టర్ ప్రణీత, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ డాక్టర్ భవాని, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సుమన్, హెల్త్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, హెడ్ నర్సులు ఉమామహేశ్వరి, రోజులిన్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ దేవేందర్, నర్సింగ్ ఆఫీసర్లు బాలకిషన్, శ్రీనివాస్, నవీన్, ల్యాబ్ టెక్నీషియన్లు రాజు, కరుణాకర్, గౌతమ్, మహేందర్, నజీర్ అహ్మద్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఆరోగ్యమిత్ర సురేందర్, జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనూప్, గజ్వేల్ యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్, ఆపన్న హస్తం ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు దొంతుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




