03-05-2025 09:21:42 PM
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్
కుమ్రంభీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ నిలిపివేసి మావోయిస్టుల(Maoists)తో చర్చలు జరపాలని సిపిఐ పార్టీ(CPI Party) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కలవెణి శంకర్(CPI Party State Secretary Kalaveni Shankar) డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు.వైద్య, విద్య ,గ్రామీణ ఉపాధి సంక్షేమం పథకాలకు నిధులు తగ్గించి కార్పొరేట్ వ్యవస్థకు రెడ్ కార్పెట్ వేస్తున్నారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మావోయిస్టులను మట్టుపెట్టేందుకు అత్యాధునిక ఆయుధాలతో పాటు డ్రోన్లతో జల్లెడ పట్టి మారుణ హోమం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.బిజెపి తనకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై బెదిరింపు ధోరణికి పాల్పడుతుందని ఆరోపించారు. సిపిఐ పార్టీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈనెల 25 న మాహ సభలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆత్మకూరి చిరంజీవి, దివాకర్ పాల్గొన్నారు.