03-05-2025 09:16:53 PM
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్
తుంగతుర్తి,(విజయక్రాంతి): కంఠమహేశ్వర స్వామి కృపతో ప్రజలు, గౌడ కులస్తులు ఆనందంగా ఉండాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. మండల కేంద్రంలోని తూర్పుగూడెం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవం కంఠమహేశ్వర స్వామి సురమాంబ కల్యాణోత్సవంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ... గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి పెద్దఎత్తున తమ ఇష్ట దైవం కల్యాణం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగరి గోవర్ధన్, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తిరుమల ప్రగడ. కిషన్ రావు, నల్లు రామచంద్ర రెడ్డి, దాసరి శీను, సంకినేని రమేష్, గౌడ సంఘం సొసైటీ సర్పంచ్ గుండగాని కొమురెల్లి గౌడ్, పెద్ద గౌడ్ గుండగాని రాములు, గౌడ సంఘం సభ్యులు గుండగాని మహేందర్, గుండగాని సుధాకర్, గుండ్ల వెంకన్న, మల్లయ్య, రమేష్, అమరేందర్, గునిగంటి వెంకన్న, విక్రమ్, గుండగాని మల్లయ్య, గుండగాని ఎల్లయ్య, గుండ్ల ఉమేష్, గుండగాని మిన్నయ్య, మధు తదితరులు పాల్గొన్నారు