calender_icon.png 19 May, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరణ్యంలో ఆరోగ్య సేవలు

03-05-2025 09:27:33 PM

మణుగూరు పిహెచ్సి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం 

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జ్వరాలపై ప్రత్యేక ప్రత్యేక సర్వే నిర్వహించారు. శనివారం మణుగూరు మండల  పరిధిలోని  వలస ఆదివాసి గ్రామమైన బుడుగుల, ఖమ్మం తోగు గ్రామాల్లో  asymptomatic ఫివర్ సర్వే నిర్వహించి, రక్త నమూనాలను ఆర్ డి ఏ పరీక్ష నిర్వహించారు. అనంతరం హెల్త్ క్యాంపు నిర్వహించి పిల్లలకు, పెద్దలకు వివిధ రుగ్మతలకు మందులు పంపిణీ చేశారు. పిల్లలకు, గర్భిణి స్త్రీలకు టీకాలు వేశారు. డాక్టర్ నిశాంత్ రావు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, మలేరియా రాకుండా తీసుకోవాల్సిన చర్యలను తెలియ చేశారు. సబ్ యూనిట్ ఆఫీసర్-వీరాస్వామి, హెచ్ వి-అనసూర్య, హెల్త్ అసిస్టెంట్ లు-రాంప్రసాద్, కృష్ణ, సుజాత, కౌసల్య,  ప్రియా భారతి, రవి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.