7 March, 2026 | 4:39 AM

సీపీఎస్ ఉద్యోగులు వివరాలు తెలపాలి

06-03-2026 09:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని డీడీవో లందరికి తెలియపరుచునది ఏమనగా తమ పరిధిలో గల సీపీఎస్ ఉద్యోగుల డెమోగ్రాఫిక్ డిటైల్స్ లో మొబైల్ నెంబర్,పాన్ కార్డ్ నెంబర్ బ్యాంకు అకౌంట్, నామినీ వివరాలు చూసుకోవాలని జిల్లా ట్రెజరీ అధికారి సరోజ తెలిపారు. పైన తెలిపిన మొదలగునవి సరిగా ఉన్నాయా లేదా సరిచూసుకుని డీడీవో లాగిన్ లోనే ఈ వెసులుబాటు ను కల్పించారని వివరించారు.

పై వివరాల కోసం సంబంధిత డీడీఓ CRA NSDL protean site లోకి వెళ్లి యూసర్ ఐడి box లో డీడీఓ రిజిస్ట్రేషన్ నంబర్ తో రెండు సున్నాలు (00) జోడించి పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించి పరిష్కరించు కోవాలని కోరుతున్నారు.