calender_icon.png 14 August, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధైర్య పడకండి..అండగా ఉంటాం..

14-08-2025 12:38:30 PM

శాశ్వత పరిష్కారం కోసం పక్కా ప్రణాళికలు 

పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి) : కురిసిన వర్షానికి మహబూబ్ నగర్ పట్టణంలో(Mahabubnagar town) లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) ప్రత్యేకంగా రామయ్య బౌలితోపాటు పలు కాలనీలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ?వర్షం బాగా కురిస్తే నీరు ఎక్కువగా నిలుస్తుందో ? పక్కగా సమాచారం సేకరించి నివేదిక తయారుచేసి అందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని ఎక్కడ  నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. వర్షం నీరు  సాఫీగా పోయేందుకు వెంటనే డ్రైనేజీలను వెంటనే శుభ్రం చేయించాలని కమీషనర్ ను ఆదేశించారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు  ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య ఉన్న వెంటనే స్పందించి పరిష్కరించాలని  సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు.  ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి , డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు ప్రవీణ్ కుమార్,జహీర్, అక్బర్, మెట్టుకాడి ప్రభాకర్, మథిన్, జునేద్ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.