గాడీకెక్కిన గంజాయి!
స్మగ్లర్లకు రాచమార్గాలుగా రైళ్లు
ఒడిశా టు ముంబై వయా తెలంగాణ
నిత్యం ఏదో ఓ రైల్వే స్టేషన్‌లో పట్టివేత
ఒక్క నెలలోనే 6.58 క్వింటాళ్ల సరుకు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి) : అడ్డదారుల్లో ఈజీ మనీ సంపాదించాలనుకునే అక్రమార్కులకు గం జాయి రవాణా ఓ లాభదాయకంగా మారిం ది. గంజాయి రవాణా చేసే వారు రైళ్లను ఆశ్రయిస్తూ బోగీల్లోని ఎక్కడో ఒక చోట కూర్చొని, మరో చోట గంజాయి సంచులను, ప్యాకేట్లను దాచి ఉంచుతుండడంంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. దొరికితే దొంగ లేదంటే దొర అన్నట్లుగా గంజాయి రవాణా ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు.
ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి తెలంగాణ ముంబైకి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, సహా పలు రైళ్లలో గంజాయి రవాణా చేస్తూ అక్రమార్కులు సంపాదనకు అలవాటు పడ్డారని ఆరోపణలు వస్తున్నా యి. కానీ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రైల్వే, సివిల్ పోలీసులు గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి గంజాయి రవాణాను నిలువరిస్తున్నారు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కేంద్రంగా అక్రమ రవాణా
నగరంలో డ్రగ్స్ వినియోగదారులు పెరుగతుండడంతో ఈజీగా డబ్బు సంపాదిం చుకోవచ్చని అక్రమార్కులు వివిధ ప్రాం తాల నుంచి హైదరాబాద్‌కు గంజాయి, డ్రగ్స్‌ను తరలిస్తున్నా రు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఎక్సైజ్, పోలీసు, ఇతర శాఖలను ఆదేశించారు. దీంతో గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయంపై ఇటీవల ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులను తీవ్రం చేశారు. అయితే కొంతకాలం కిందటి వరకు కార్లు, వాహనాల్లో గంజాయిని రవాణా చేసే అక్రమార్కులు ఎక్సైజ్, పోలీసుల దాడుల్లో పట్టుబడుతుండడంతో వ్యూహం మార్చుకున్నారు.
గంజాయిని సులభంగా తరలించే అవకాశం కోసం రైళ్లను ఎంచుకున్నారు. ఒడిషా నుంచి తెలంగాణకు రైళ్ల ద్వారా గంజాయి ఎక్కువగా రవాణా అవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు అంచనాకు వచ్చి పలు రైళ్లను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకుంటున్నారు. ముఖ్యం ఖమ్మం వరకు రైళ్లలో గంజాయిని తీసుకువచ్చిన అక్రమార్కులు అక్కడ నుంచి హైదరాబాద్ సహా వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 22.83క్వింటాళ్ల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి తోడు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం భద్రాచలం, ఖమ్మం లో నిర్వహించిన వరుస దాడుల్లో 5.2 క్విం టాళ్లు, తాండూరులో 56కేజీలు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 62కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు ఇప్పటి వరకు కేవలం రైళ్లలోనే పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.50లక్షలు ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు.
వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో...
వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నట్లు రైల్వే సీఐ పద్మభూషన్ తెలిపారు. రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపిం చిన ఇద్దరిని ఎస్సై శంకరయ్య దగ్గరకు పిలిచాడు. వారి వద్ద ఉన్న సం చులను చూపించమని కోరాడు. సం చులు తీస్తూనే పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్సై వెంట ఉన్న సిబ్బంది ఒకరిని పట్టుకున్నారు. సంచులను విప్పించి చూడగా గంజాయిని గుర్తించారు. 60 కేజీల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఒడి శా నుండి ముంబైకి తరలిస్తున్నట్లు దొరికిన వ్యక్తి సంజీత్‌కుమార్ చెప్పా డు. మరోవ్యక్తి ప్రశాంత్ గుయాన్‌గా గుర్తించారు. సంజీత్‌ను రిమాండ్‌కు పంపగా, ప్రశాంత్ కోసం గాలిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో...
తాజాగా మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గం జాయిని పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సునీత నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






