26 August, 2026 | 4:55 AM

విప్లవోద్యమ నాయకురాలు రాధక్క మృతి

12-06-2024 02:08 AM

ప్రతిఘటనోద్యమ నేత చండ్ర పుల్లారెడ్డి జీవిత సహచరి 

కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రాధక్క 

హైదరాబాద్ సింగరేణి కాలనీలోని కుమార్తె నివాసంలో మృతి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలలో ప్రజలకు సుపరిచితురాలైన రాధక్క (86) మంగళవారం కన్నుమూశారు. రాధక్క అనేక విప్లవ ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. దళ నాయకురాలిగా ఆదివాసీ ప్రాంతాల్లో అనేక పోరాటాలు నిర్వహించారు. విప్లవ శ్రేణులకు సాయుధ, ప్రతిఘటనోద్యమ నేతగా పేరుగాంచిన చండ్ర పుల్లారెడ్డికి రాధక్క జీవిత సహచరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన రాధక్క అసలు పేరు నిర్మల.

కమ్యూనిస్టు పార్టీ కుటుంబానికి చెందిన రాధక్క నివాసానికి అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలంతా వచ్చి షెల్టర్ తీసుకునే వారు. పుచ్చలపల్లి సుందరయ్య, పోట్ల రామనర్సయ్య, తరిమిల నాగిరెడ్డి, చండ్ర పుల్లా రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితర అగ్రనేతలంతా రాధక్క ఇంటికి వెళ్తుండేవారు. పాలిటెక్నిక్ చదువుకున్న రాధక్క కమ్యూనిస్టు పా ర్టీ విప్లవ రాజకీయాల పట్ల ఆక ర్షితురాలై విప్లవ కార్యక్రమాలలో చురుకుగా పా ల్గొన్నారు. ఉమ్మడిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం) చీలికల అనంతరం 1984లో చండ్ర పుల్లారెడ్డి, కూర రాజన్న, మధుసూదన్ రాజ్ వైపు నిలి చి ముఖ్య నాయకురాలిగా ఎదిగారు.

1969 లో చండ్ర పుల్లారెడ్డిని వివాహం చేసుకొని 1970లో అడవి బాట పట్టారు. అప్పటి నుం చి ఆదివాసీ, గిరిజన ఉద్యమాలలో సాయు ధ పోరాటం సాగించారు. ఈ క్రమంలో రాధక్క ఆయుధాలతో పట్టుబడి జైలు జీవి తం గడిపారు. పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర కమిటీ నాయకురాలి వరకు వివిధ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. రాధక్క కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఏడాది కాలంగా క్యా న్సర్‌తో ఇబ్బంది పడుతూ హైదరాబాద్ సిం గరేణి కాలనీలోని గ్రీన్‌పార్కు ప్రాంతంలో ఉన్న తన కుమార్తె నివాసంలో మంగళవారం ఉదయం 10 గంటలకు కన్నుమూ శారు. రాధక్క కుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉన్నందున అంత్యక్రియలు ఈ నెల 13న జరుగుతాయని విప్లవ శ్రేణులు తెలిపారు. 

12 నుంచి 20 దాకా సంతాప సభలు.. 

రాధక్క అనేక దశాబ్దాలు ప్రతిఘటన ఉద్యమాలకు ప్రతినిధిగా ఉన్నారని, జీవితాంతం ప్రజల కోసమే పనిచేశారని పలువురు విప్లవ కమ్యూనిస్టు పార్టీ నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. జీవితతాంతం విప్లవోద్యమాన్నే నమ్ముకొని ప్రతిఘటన ఉద్యమాలకు చిరునా మాగా ఉన్నారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న, రాష్ట్ర కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు రాధక్క సంతాప సభలు జరపనున్నట్టు వారు తెలిపారు. తెలుగు నేలపై జరిగిన మహాత్తర విప్లవ పోరాటాలలో రాధక్క దశాబ్దాల తరబడి అవిశ్రాంతంగా పోరాడారని న్యూడెమోక్రసీ ప్రధాన కార్యదర్శి సాధినేని వెంక టేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కే గోవర్ధన్ అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో రాధక్క ప్రముఖ పాత్ర పోషించారని గోపన్న కొనియాడారు.