25 June, 2026 | 12:58 AM

విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన

25-06-2026 12:00 AM

బోధన్, జూన్ 24 (విజయ క్రాంతి): బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో బుధవారం ఉదయం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. కల్దుర్కి జడ్పీహెచ్‌ఎస్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించినట్లు ఎస్త్స్ర రాజశేఖర్ తెలిపారు.  ఈ సందర్భంగా వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.