25 May, 2026 | 12:11 AM

హైదరాబాద్‌కు కృష్ణ, గోదావరి జలాలను తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే

20-08-2024 01:54 PM

హైదరాబాద్: తెలంగాణ ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో క్రెడాయ్ సదస్సు నిర్వహించారు. క్రెడాయ్ సదరస్సులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. స్థిరాస్తి వ్యాపారులకు అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే 40 శాతంపైగా పట్టణీకరణ జరుగుతోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రపంచంతో హైదరాబాద్ పోటీపడుతుందనడంలో సందేహం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ కు కృష్ణ, గోదావరి జలాలను తెచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని మంత్రి వెల్లడించారు. యువతకు ఉపాధి కోసం రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.