24 May, 2026 | 11:13 PM

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది

20-08-2024 02:17 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో క్రెడాయ్ సదస్సు నిర్వహించారు. క్రెడాయ్ సదరస్సులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించామని మంత్రి తెలిపారు. స్థిరాస్థి వ్యాపారుల సమస్యల పరిష్కారారినికి కృషి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మంత్రి కోమటి రెడ్డి ఆరోపించారు.