క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో
ఆగస్టు 28 నుంచి 30 వరకు నిర్వహణ
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హాల్స్ 3 లో ఆగస్టు 28 నుంచి 30 వరకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. రేటు ఆగదు డిమాండ్ తగ్గదు‘ అనే థీమ్‌తో ఈ ప్రదర్శన జరగనుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి, ప్రెసిడెంట్ -ఎలెక్ట్ బి. జగన్నాథరావు, ప్రాపర్టీ షో కన్వీనర్ బి. జైపాల్‌రెడ్డి, కో-కన్వీనర్ బి. వినోద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో 100కు పైగా రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు ఒకే వేదికపై అందుబాటులో ఉండనున్నాయని, అలాగే ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహ రుణాలపై ప్రత్యేక సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






