27 April, 2026 | 1:51 AM

ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యంపై పోరు

27-04-2026 12:00 AM

దుప్పాపూర్‌లో మద్యం నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం

నార్నూర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం పై పోరుకు ఆదివాసీలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నార్నూర్ మండలం తూప్పాపూర్ దుప్పాపూర్ గ్రామాల్లో మద్యపానం తాగడం, అమ్మడం నిషేధిస్తూ నార్నూర్ మండల  సర్పంచుల సంఘం అధ్యక్షుడు కనక సత్యం ఆధ్వర్యంలో ప్రత్యేక తీర్మానం చేశారు.

ఆదివారం ఈ సమావేశంలో గ్రామస్తులు  జ్ఞానోబా, రమేష్, తిరుముక్, భీమ్ టైగర్ యూత్ సభ్యులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొని బెల్ట్ షాప్ నిర్వహించే  వారి మద్యం బాటిల్ లను తీసుకువచ్చి  పగలగొట్టారు. ఇక నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు గానీ తాగడానికి నిషేధిస్తున్నట్లు తీర్మానించారు.