07-11-2025 01:33:53 PM
హైదరాబాద్: ''నాకు కుటుంబం నుంచి చక్కటి ప్రోత్సాహం ఉంది'' అని ఉమెన్స్ వరల్డ్ కప్ సంచలనం క్రికెటర్ శ్రీచరణి(Cricketer Shree Charani ) పేర్కొన్నారు. మా మామ నన్ను క్రికెట్ ఆడించేవారని తెలిపారు. నేను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో శిక్షణ పొందానన్న శ్రీచరణి ఇంది మొదటి అడుగు మాత్రమే.. ముందు చాలా ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు భవిష్యత్ కార్యాచరణపై సలహాలిచ్చారని తెలిపారు. దేశ ప్రజల ఆశీర్వాదంతో వన్డే ప్రపంచకప్ 2025 గెలిచామని పేర్కొన్నారు. వరల్డ్‌కప్‌లో సమిష్టిగా రాణించామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగం, రూ.2.5 కోట్లు ఇస్తామన్నారని చెప్పిన శ్రీచరణి కడపలో ఇల్లు కట్టుకునేందు స్థలం ఇస్తామని చెప్పారని సూచించారు. ఆర్ అశ్విన్ ప్రశంసలు మరువలేనిదని క్రికెటర్ శ్రీ చరిణి స్పష్టం చేశారు.
గన్నవరం ఎయిర్ పోర్టులో ఉమెన్స్ వరల్డ్ కప్ సంచలనం శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఘన స్వాగతం పలికి, భారీ ర్యాలీతో సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎంకు శ్రీచరణి వివరించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని చంద్రబాబు(CM Chandrababu) ప్రశంసించారు. వరల్డ్ కప్ గెలిచిన క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రోత్సాహకం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగంతో పాటు, రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. అలాగే శ్రీచరణికి కడపలో ఇంటి స్థలం కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశాన్ని గెలిపించిన మహిళా శక్తి, మన ఉమెన్స్ క్రికెటర్ శ్రీ చరణికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం అని సీఎం తెలిపారు.