07-11-2025 03:09:45 PM
మల్యాల,(విజయక్రాంతి): మల్యాల మండల కేంద్రంలో వందేమాతరం(Vande Mataram) 150వ ఏళ్ల సందర్భంగా మల్యాల బ్లాక్ చౌరస్తాలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో జాతీయ గీతం గౌరవాన్ని పెంపొందించడం. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం లక్ష్యంగా ఈ వేడుక జరిగింది. విద్యార్థులు వందేమాతర గీతాన్ని ఆలపించగా, ప్రాంగణమంతా దేశభక్తితో వాతావరణం కళకళలాడింది. సీ ఐ రవి మాట్లాడుతూ వందేమాతర గీతం కేవలం గీతం కాదని, అది మన తల్లి దేశం పట్ల ప్రేమ అని అన్నారు.
స్ఫూర్తి తీసుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి పాటలు, నాట్యాలు, ప్రసంగాలతో ప్రేక్షకులను అల లారించారు. గీత రచయిత బంకి చంద్ర చటర్జీ గురించి ఆయన గీతం రాసిన నేపథ్యం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఎస్సై నరేష్ మాట్లాడుతూ వందేమాతర గీతం స్వాతంత్ర ఉద్యమం పోరాటంలో పోరాటయోధులకు శక్తినిక్కింది. విద్యార్థులు ప్రమాణం చేశారు. వందేమాతరం నినాదాలు తో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలోమల్యాల సీఐ రవి, మల్యాల నరేష్, ఎస్ ఐ. ఏ ఎస్. ఐ. సిబ్బంది.నాయకులు, పాఠశాలల విద్యార్థులు. ఉపాధ్యాయులు, విద్యార్థులు.ప్రజలు తదితరులు పాల్గొన్నారు.