07-11-2025 02:20:24 PM
హైదరాబాద్: టీమిండియా ప్రముఖ క్రికెటర్లు సురేశ్ రైనా(Suresh Raina), శిఖర్ ధావన్(Shikhar Dhawan)పై హైదరాబాద్ సీపీ సజ్జనార్(Hyderabad CP Sajjanar) ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? అని సజ్జనార్ ప్రశ్నించారు. బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలివుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్(Betting) వల్ల యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. బెట్టింగ్ వల్ల వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన సెలబ్రిటీలు బాధ్యులు కారా? అని ప్రశ్నించారు. సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండని సజ్జనార్ సూచించారు.