07-11-2025 01:42:13 PM
ఘనంగా 150 సంవత్సరాల వేడుకలు
కొల్చారం: వందేమాతర గీతం ఆలపించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో వందేమాతర గీతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కొల్చారం లోని కస్తూరిబా బాలికల పాఠశాలలో నిర్వహించిన వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమానికి కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసాచారి డిప్యూటీ తహసిల్దార్ నాగవర్ధన్ కొల్చారం ఎస్సై మహమ్మద్ మొయినుద్దీన్ మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం బెంగాలీ రచయిత బకిం చంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మట్ నవల నుండి వందేమాతరం గేయాన్ని తీసుకొని స్వాతంత్ర ఉద్యమం లో పాడారన్నారు. ఈ గీతం స్వాతంత్రోద్యమానికి శక్తినిచ్చిన గీతం అన్నారు. జాతిని స్వాతంత్ర ఉద్యమం వైపు ఉత్తేజపరిచిన గీతం అన్నారు. స్వతంత్ర సమరయోధులు జైలు లలో కూడా వందేమాతర గీతం ఆలపించి ఉత్తేజం పొందారన్నారు అలాంటి గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాడవాడల వందేమాతర గీతం ఆలాపించేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నాటి స్వతంత్ర సమరయోధులకు స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.