calender_icon.png 7 November, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

07-11-2025 01:40:10 PM

కొండాపూర్: వందేమాతర గీతం అలపించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కొండాపూర్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో వందేమాతర(Vande Mataram) గీతం కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది దేశభక్తిని చాటుతూ సామూహికంగా వందేమాతరం గీతాన్ని అలపించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ అశోక్ మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం బెంగాలీ రచయిత వాక్యం చంద్ర చటర్జీ రచించిన ఆనంద్ నవల నుండి వందేమాతరం గేయాన్ని తీసుకొని స్వతంత్ర ఉద్యమంలో పాడినారు. ఈ గీతం స్వతంత్రోద్యమానికి శక్తినిచ్చిన గీతం అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అశోక్, ఆర్ఐ రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.