calender_icon.png 7 November, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవడం ఖాయం: బండి సంజయ్

07-11-2025 02:02:05 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకుంది.

ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ గా పార్టీ పేరు.

హైదరాబాద్: బీఆర్ఎస్ స్థాయి పెంచాలని సర్వే సంస్థలకు ఆదేశించారని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay ) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్థానికంగా సర్వే నిర్వహించారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఏ సర్వేకు అనుగుణంగా ఆ పార్టీలు గెలుస్తాయని ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలోని సర్వే సంస్థకు రూ. 2 కోట్లు ఇచ్చిందని బండి సంజయ్ ఆరోపించారు. రెండు పార్టీలకు గుణపాఠం చెప్పి బీజేపీకి అవకాశం ఇవ్వలని ప్రజలు ఆలోచన చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

మస్లింల మెప్పు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ గెలువబోతుందని కేంద్రమంత్రి తేల్చిచెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకుందని ఆయన తెలిపారు. ఇండియన్ ముస్లి కాంగ్రెస్ గా పార్టీ పేరు మార్చుకుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ, ఐఎంసీ మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. నిన్న బోరబండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు పాలించి పైసలు సంపాదించుకున్నారు కానీ బోరబండను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.