07-11-2025 01:44:14 PM
రామగుండము పోలీస్ కమీషనరేట్ లో వందేమాతరం గీతాలాపన లో సీపీ అంబర్ కిషోర్ ఝూ
రామగుండం,(విజయక్రాంతి): భరత జాతి బానిసత్వ విముక్తి , జనజాగృతి గీతం – వందేమాతరం(Vande Mataram) మంథని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝూ అన్నారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న బంకింఛంద్ర చటర్జీ రచించిన ఈ అద్భుతమైన వందేమాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం వందేమాతర గీతాలాపన కార్యక్రమం రామగుండము పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ అంబర్ కిషోర్ ఝా హాజరై అధికారులు, సిబ్బంది తో కలిసి వందేమాతరం సామూహిక గీతాలాపన చేశారు .
ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలంలో జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం, మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చిందని, జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. తర్వాత కొద్ది కాలంలోనే ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారిందన్నారు. మన గర్వం, గౌరవం, ఉమ్మడి గుర్తింపును పెంపొందిస్తూ మనందరికీ ఐక్యం చేస్తున్న జాతీయ గేయాన్ని గౌరవించేందుకు.. దేశభక్తి, కృతజ్ఞతకు సమష్టి ప్రతీకగా ఈ కార్యక్రమాలలో దేశ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమములో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు వామన మూర్తి, మల్లేశం, సూపరిండెంట్స్ ఇంద్రసేనారెడ్డి, సందీప్, సంధ్య, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఎసఐ లు, ఆర్ ఐ లు శ్రీనివాస్, వామన మూర్తి, మల్లేశం, సిసి హరీష్, సీపీఓ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.