31 March, 2026 | 5:41 PM

Breaking News

దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు   •   మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా   •   పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి   •   ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్   •   మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్   •   కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు   •   ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి   •   బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   •   ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు   •   పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు   •  

క్రికెటర్ త్రిషకు రూ.కోటి నజరానా!

06-02-2025 01:01 AM

* ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి

* అండర్ వరల్డ్ కప్‌లో సత్తాచాటడంపై సీఎం అభినందనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మహిళల అండర్ ట్వంటీ20 వరల్డ్ కప్‌లో సత్తా చాటిన క్రికెటర్ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ. కోటి నజరానా ప్రకటించారు. అండర్ 19 వరల్డ్‌కప్ టీమ్ హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు ప్రకటించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మహిళా క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి త్రిషను అభినందించారు. భవిష్యత్‌లో దేశం తరపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ మెంబర్ తెలంగాణకు చెందిన ధృతి కేసరికి రూ.10 లక్షలు నజరానా ప్రకటించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు ఉన్నారు.