జిల్లాలో నేరాలను తగ్గించాలి
నిర్మల్, ఆగస్టు 10 ( విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ లక్ష్యంగా నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ జానకి డాక్టర్ షర్మిల అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ సమావేశం నిర్వహించారు.
దొంగతనాల నియంత్రణ, మాదకద్ర వ్యాల నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీయి జం సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపట్ల కఠినంగా వివరించాలన్నారు. వివిధ కేసుల్లో నిందితులను పట్టు కొని కఠినంగా శిక్షించాలి అన్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసులు పరిష్కరించడం కేసులు పెండింగ్లో ఉన్న కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ పోలీసులు పాల్గొన్నారు.






