11 August, 2026 | 2:31 AM

జైలు భరోతో దద్దరిల్లిన తెలంగాణ

11-08-2026 01:21 AM
  1. ప్రజా సంఘాల ఆందోళనలు
  2. ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్ బ్యూరో, ఆగస్టు 10: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసిస్తూ  తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ‘జైలు భరో‘ కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్యూ తదితర కార్మిక, కర్షక, మహిళా, విద్యార్థి సంఘాల నాయకులు భారీ ప్రదర్శనకు సిద్ధం కాగా, పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని ముందస్తుగా, ఆందోళన సమయంలో పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు.

ఈ సందర్భంగా నిరసనకారులను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ప్రజా సంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.  మహిళా నాయకులను సైతం లెక్కచేయకుండా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.