calender_icon.png 5 December, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గులాబీ పార్టీలో చేరికల జోష్

05-12-2025 09:01:58 PM

ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరికలు

బోథ్,(విజయక్రాంతి): స్థానిక ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది. బోథ్ మండల కేంద్రానికి చెందిన హమాలి కూలీలతో పాటు 50 మంది యువకులు శుక్రవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాలను సస్యశ్యామలం చేసిన బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రతీ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా రైతుల సమస్యల కొరకు రైతు వేదికలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు.