05-12-2025 08:57:10 PM
సర్పంచ్ అభ్యర్థి దీపిక సుదర్శన్
మిడ్జిల్: గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి ఓటు వేస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి దీపిక సుదర్శన్ అన్నారు. శుక్రవారం గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామంలో సమస్యలైన విద్యుత్ దీపాలు, సిసి రోడ్లు తదితర సమస్యలు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని వారు పేర్కొన్నారు. గ్రామ సర్పంచిగా ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా తమతోపాటు తన ప్యానెల్ లో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు.