నేటి నుంచి రైతులకు పంట నష్ట పరిహారం
పది జిల్లాల్లో 15,814 ఎకరాల్లో వడగళ్లకు దెబ్బతిన్న పంటలు
15,246 మంది రైతులకు రూ. 15.81 కోట్లు విడుదల
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం బాధిత రైతులకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పంటనష్టం నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసింది. పది జిల్లాలో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ప్రకటించిన నష్ట పరిహారం మంగళవారం లోపు వారి ఖాతాల్లో జమచేయాలని వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభు త్వం ఆదేశించింది. 15,814 ఎకరాల్లో పంట నష్టంగా జర గ్గా 15,246 మంది రైతులకు రూ. 15.81 కోట్ల నిధు లు విడుదల చేసిం ది. ఎకరానికి రూ. 10 వేల చొప్పన జమ చేయనుంది. రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డిలో 10వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది.
జిల్లాల వారీగా పంట నష్టం, రైతుల వివరాలు..
జిల్లా పంట నష్టం రైతులు సబ్సిడీ రూ.
విస్తీర్ణం
కామారెడ్డి 10328.04 9107 10328.10
నిజామాబాద్ 1,65,52.25 1809 165262.50
రాజన్న సిరిసిల్ల 1,014.06 1036 101415.00
సిద్దిపేట 746.30 793 74675.00
మెదక్ 714.17 957 71442.50
ఆదిలాబాద్ 545.09 370 54522.50
నిర్మల్ 332.17 519 33242.50
మంచిర్యాల 244.01 376 24402.50
కరీంనగర్ 160.10 160 16025.00
సంగారెడ్డి 76.04 119 7610.00
మొత్తం 15814.03 15246 1581407.50




