మౌలిక సౌకర్యాలు కలిపించాలి
07-05-2024 12:34 AM
సంగారెడ్డి డీఆర్‌డీవో జ్యోతి
సంగారెడ్డి, మే 6 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల్లో మోడల్ పోలింగ్ కేంద్రా ల్లో మౌలిక సదుపాయలు కలిపించేందుకు ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి డీఆర్‌డీవో జ్యోతి సూచించారు. సోమవారం సంగారెడ్డి డీఆర్‌డీవో కార్యాలయంలో ఐకేపీ ఏపీఎం లు, సీసీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మోడల్ పోలింగ్ కేంద్రంలో షామియానాలు ఏర్పాటు చేసి ఓటర్లుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలిపించాలన్నారు. మోడల్ పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు కలిపించే బాధ్యత ఐకేపి అధికారులకు అప్పగించామన్నారు. నిర్లక్ష్యం చేయకుండా అన్ని సౌక ర్యలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశం లో ఐకేపీ ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.




