బీఆర్‌ఎస్‌లో చేరిన కొడకంచి మాజీ సర్పంచ్
07-05-2024 12:35 AM
పటాన్‌చెరు, మే 6: జిన్నారం మం డలం కొడకంచి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీశైలంయాదవ్ సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. పటాన్‌చెరులోని జీఎం ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో శ్రీశైలంయాదవ్ బీఆర్‌ఎస్‌లో చేరగా పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైలం చేరికతో జిన్నారం మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి మరింత బలం పెరిగిందన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మ న్ ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ కొలనుబాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ చెట్టి శివరాజ్ పాల్గొన్నారు.




