పంట దొంగలు!
- వారం రోజుల్లో మూడు చోరీలు
- రోడ్లపై ఆరబోసిన ధాన్యం సంచులు లూటీ
- ఆందోళన చెందుతున్న రైతులు
నిర్మల్ ఏప్రిల్ 11 ( విజయ క్రాంతి) : దొంగతనాల్లో ట్రెండ్ మారింది. ఇప్పటివరకు ఇంట్లో ఉన్న తాళం పగలగొట్టి నగదు నగలు, ఇంటిముందు నిలుపుదల చేసిన బైకు, ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో నుంచి గొలుసు లాక్కోవడం, పాకెట్ కటింగ్ కటింగ్ , దొంగల గురించి విన్న... చూసినం. కానీ ప్రస్తుతం దొంగల ట్రెండ్ మారింది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి పంట కళ్ళల్లో, రోడ్లపై, మైదాన ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం పంటలు ఎత్తుకెళ్లి దొంగల ముఠా నిర్మల్ లో కలకలాని సృష్టిస్తుంది.
వా రం రోజుల్లోనే మూడు చోట్ల సుమారు నాలుగు లక్షల విలువచేసే ధాన్యం సంచులు దోపిడి జరగడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. ఆ ధాన్యాన్ని దొంగిలించేందు కు సుమారు గంట సమయం పట్టి అవకాశం ఉన్న దొంగలు ఇలాంటి తరహా దొం గతనం పెంచుకొని తప్పించుకోవడం రైతులకు ఆందోళన కలిగిస్తుంది. ఆరుకాలం కష్ట పడి ఎండనక వారానక పంటకు నీరు పెట్టి నూరుపిడి చేసి, పంటను అమ్ముకున్న అం దామని సంచులు నింపితే అవి నడి రాత్రి దోపిడి దొంగలు ధాన్యం సంచులను వాహనాలు ఎక్కించుకొని దోపిడికి పాల్పడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నిర్మల్ జిల్లాలో నిర్మల్ ఖానాపూర్ కుబీర్ ముధోల్ తానూర్ లోకేశ్వరం సారంగాపూర్ నర్సాపూర్ తదితర మండలంలో వాన కాలం, యాసంగిలో రైతులు సాగుచేసిన మొక్కజొన్న, పసుపు, వరి, జొన్న, మిర్చి, పత్తి తోగల్లు పంటలు ఏవైనా కోసి ఆరబెట్టి అమ్ముకోవడానికి సంచులు నింపితే వాటిని దొంగలు ఎత్తుకెళ్లడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.
పథకం ప్రకారమే దొంగతనాలు..
నిర్మల్ జిల్లాలో పంటదొంగలు పథకం ప్రకారమే ఇటువంటి చోరీలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణం గా పంట దొంగతనం చేయాలంటే ధైర్యం, ఆ పంటకు రవాణా చేసే వాహన సదుపా యం, రూట్ మ్యాప్, ఆ ప్రాంతంలో రైతు ల కదలికలపై స్పష్టంగా అవగాహన ఉం డాలి. పంట కళ్ళలో బ్యాగులో సంచులు నింపి ఉన్న ధాన్యం తరలించేందుకు సమయం కూడా ఎక్కువగానే పడుతుంది.
అయితే దీని పై పూర్తిగా అవగాహన పెంచుకొని నలుగురైదుగురు సభ్యులు గల ముఠాగా ఏర్పడి ఇటువంటి దొంగతనాలు చేస్తున్నట్టు రైతు లు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రైతులు పంటను పంటచేల్లో ఆరబోసి ఇంటికి వెళ్తా రు. దీన్ని గమనించిన కొందరు ఆ ముఠా చేతులు కలిపి వాహనాలను సమకూర్చుకొని ధాన్యం సంచులను ఎక్కించుకొని సీసీ కెమెరాలకు చిక్కకుండా రూట్ మ్యాప్ ను ఎంచుకుంటున్నారు.
ఈ ప్రాంతంలో పంట ను విక్రయిస్తే అనుమానం వస్తుందని భావిస్తున్న దొంగలు సుదూర ప్రాంతాలకు పం టను తరలించి అక్కడ నిల్వ ఉంచి తర్వాత విక్రయిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ముధోల్ నియోజకవర్గంలో కుంటాల కుబీర్ తానూర్ ముధోల్ బాసర్ నర్సాపూర్ సారంగాపూర్ తదితర మండలాల్లోని వివిధ గ్రామాలు మహారాష్ట్రకు సరిహ ద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఇటువంటి దొంగతనాలు జరుగుతున్నాయి.
దోపిడి చేసిన ధాన్యాన్ని ఎంచక్కా మన రాష్ట్రం సరిహద్దు దాటిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఉన్న అవి నామమాత్రంగా పనిచేస్తున్నాయి. రాత్రి వేళలో పోలీ సులు తనిఖీలు నిర్వహిస్తున్న మొక్క బ్యాగు లు, పత్తి తత్ర పంటలు కావడంతో ఇవి రైతులకు చెందినవిగా వాహనాలను తనిఖీ చేయకుండా పంపిస్తున్నారు.. ఒకవేళ తనిఖీ చేసిన కున్న మొక్కలుగా వారు పోలీసులను నమ్మిస్తున్నారు.
ఆయా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్న అవి కొన్ని ప్రాంతాల్లో పనిచేయ కూడదు పంటదొంగల భాగోతం బయటపడడం లేదు.. ఒకవైపు గుడ్లు. బస్టాండ్లు. వ్యా పార దుకాణాలు. దొంగతనాలు జరుగుతుండగా తాజాగా రైతులు పండించిన దా న్యం లూటీ దొంగలు దోపిడీ చేయడం జిల్లా ప్రజలను ముఖ్యంగా రైతులను ఎంతో ఇబ్బంది కి గురిచేస్తుంది. ఇటువంటి దొంగతనాలు జరగకుండా పోలీస్ శాఖ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి.
రైతులు కూడా తమ పంట చేల్లో ఆరబోసిన ధాన్యం వద్దని కాపు కాస్తే పంట రక్షణ ఉంటుంది. ఈ దొంగతనాలు నేతలకు పోలీస్ శాఖ చర్యలు తీసుకు ంటున్న ఇప్పటివరకు జరిగిన దొంగతనాల్లో నేరస్తులను గుర్తించడం లేదు. అయితే దీనిపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పోలీసులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసులు చెప్తున్నారు.
వరుస ఘటనలతో ఆందోళన..
నిర్మల్ జిల్లాలో రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంటలు పంటచేల్లో నిలువ ఉంచితే అవి రాత్రికి రాత్రి చోరీ జరుగుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం కుంటాల మండలం కుంటాల కల్లూరు రహదారిపై వెంకురు గ్రామానికి చెందిన రైతు నారాయణ 55 క్వింటాళ్లు మొక్కజొన్న చోరికి గురైంది. పంటను ఆరబోసి రోడ్డుపై సంచులు నింపి మార్కెట్ తరలిద్దామనుకుంటే రా త్రికి రాత్రి 110 మొక్కజొన్న బ్యాగులను మూర్తి తెలియని దుండగులు వాహనా ల్లో ఎక్కించుకొని పారిపోయారు.
ప్రస్తు తం మార్కెట్లో క్వింటాలు మార్కెట్లో రూ. 2000 ధర పలుకుతుంది. 55 క్వింటాళ్లు చోరికి గురకగా రైతుకు లక్ష పదివేలు న ష్టం జరిగింది. తాజాగా గురువారం రాత్రి ముధోల్ మండలం విట్టోలి గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు లో రోడ్డుపై ఆరబోసిన జొన్న 50 బ్యాగులు గురయ్యా యి. ప్రస్తుత మార్కెట్లో జోన్న ధర క్విం టాలుకు 2800 ధర పలుకుతుంది. అం టే సుమారు రూ.1.40 లక్షల విలువచేసి జొన్నలు దోపిడికి గురయ్యాయి.
కుబీర్ మండలంలోని ఓ గ్రామంలో 10 రోజుల క్రితం 10 క్వింటాళ్ల ధాన్యం దోపిడికి గురైంది. వానాకాలం సీజన్లో కుంటాల మండలంలోని పూల గ్రామానికి చెందిన రైతులు వేణుగోపాల్, కుమ్మరి దేవన్న కు చెందిన పత్తి ముల్లెలు గుత్తి లేని దుండగులు చోరీ చేసి ఎత్తుకెళ్లిపోయారు. గతం లో కూడా పంటచెర్లో పత్తి మిర్చి కందులు తోగల్లు శనిగలు తదితర పంటలు దొంగతనం చేశారు.
నగలు నగదు ఇండ్ల తాళా లు పగలగొట్టి దొంగతనం చేయడం, మహిళా మెడలో నుంచి గొలుసులు లేకపోవడం, జీప్ కటింగ్ వంటి దొంగ తనాలు జరగడం జిల్లాలో తరచుగా జరుగుతున్న ఇప్పుడు ఏకంగా రైతులు కష్టపడి పండించిన పంట దోపిడికి గురి కావడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రైతులు పంటలు సాగు చేసుకునేటప్పుడు దుక్కి దున్ని విత్తనాలు వేసి కలుపు తీసి సస్యరక్షణ చర్యలు చేపట్టి , సేకరించి ఆరబోసి పంటను అమ్ముకొని తమ పంట పెట్టబడును తీసుకుందామనుకున్న రైతులకు ఇటువంటి దొంగతనా లు అసలికే మోసం చేస్తున్నాయి.
ఎండనక వాననక రాత్రి పగలు కుటుంబం మొ త్తం కష్టపడి పంటను సాగు చేస్తే విక్రయించుకున్న సమయంలో ఆ పంట దొంగల పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా బోధిస్తున్నారు. పంటలకు పెట్టుబ డులు అధిక కావడం మద్దతు ధర లేకు న్నా వ్యవసాయ జీవనాధారంగా బతుకుతున్న జిల్లా రైతు సంఘం పంటపై ఎన్నో ఆశలు పెంచుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా పంటలు సాగు చేస్తుండగా ఆ పంటకు ప్రస్తుతం రక్షణ కరువైపోవడంతో లబోదిబోమంటున్నారు




