అల్లుడు కొడుకు ఒకటవుతున్నారు
రాష్ట్రం ఏర్పడక ముందు ఉప ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ
కాంగ్రెస్ రాజకీయ ఉద్దండుడు గులాబీ గూటికి
మారిన రాజకియా సమీకరణలతో కెసిఆర్ జీవన్ రెడ్డి ఒకే వేదికపై
కరీంనగర్: ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకరు టిఆర్‌ఎస్ అధినేత, మరొకరు కాంగ్రెస్ పార్టీ రాజ కీయ ఉద్దండుడు రాష్ట్రం సిద్ధించక ముందు అల్లుడు కావాలా కొడుకు కావాలా అని రా జకీయాల్లో ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్న వీరు ఇప్పుడు ఒకటవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరులో జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ పార్టీ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నో పదవులు అలంకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో జగిత్యాల ప్రాంతం నుంచి అక్కడి ఎమ్మెల్యే సం జయ్ కుమార్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గత కొద్ది నెలలుగా జీవన్ రెడ్డి పా ర్టీలో అసంతృప్తితో ఉన్నారు. గత కొద్ది నెలల క్రితం ఇదేవిధంగా కార్యకర్తలకు అన్యా యం జరిగిందని ఆయన రాస్తారోకో చేయ గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రి శ్రీధర్ బాబు లక్ష్మణ్ కుమార్, వచ్చి ఆయనను బుజ్జగించగా చల్లబడ్డారు.
కానీ మళ్లీ పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందని పార్టీని వీడెందుకు ముందుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు బుజ్జగించిన ఆయ న తన పంతం మార్చుకోలేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగనే విమర్శ లు ఎక్కు పెట్టారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు ఆయన రూపకల్ప చేసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి చర్చించి వెళ్లిపోయారు. అనంతరం శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు.
--అల్లుడు కావాలా కొడుకు కావాలా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరీంనగర్ పార్లమెంటు కు రెండు పర్యాయాలు ఉప ఎన్నికలు జరిగాయి. 2006 మరియు 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెం ట్ నుంచి అప్పటి మంత్రి ఎం ఎస్ ఆర్ తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది పార్టీ లేదని ఆరోపణ చేయగా వెంటనే కేంద్ర మంత్రి పదవికి కెసిఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నికల దిగా రు. అప్పుడు ఆయనకు దీటైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని వడబోయగా జగిత్యాల ప్రాంత నేత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కెసిఆర్ కు పోటీ ఇస్తాడని కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఉప ఎన్నికల్లో కేసీఆర్ పై బరిలో నిలిపారు.
ఆ సమయంలో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయం నిర్మాణం జరుగుతూ 9 గ్రామాలు పక్షకంగా మరో తొమ్మిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. అప్పుడు బోయినపల్లి ప్రాం తంలో కోదురుపాకలో పాత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అల్లుడు కావాలా కొడుకు కావాలా అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రజలను ప్రశ్నించి ఓటు అడిగారు. టిఆర్‌ఎస్ అధినేత కుదురుపాక నుంచి ఆయన సతీమణిని వివాహం చేసుకోగా కెసిఆర్ కోదురుపాకకు అల్లుడు కాగా, అందుకు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కొడుకుగా నేను పోటీ చేస్తున్నాను, అల్లుడైన కేసీఆర్, కొడుకుని ఆయన నేను ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోవాలని ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ విధంగా ప్రతి గ్రామానికి వెళ్లి అల్లుడు కావాలా ? కొడుకు కావాలా ? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అప్పట్లో మాట్లాడిన ఈ మాటలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలందరూ చర్చించుకున్నారు. ఎందుకంటే కొడుకును అయిన నేను ఈ సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతానికి చెందిన వాడిగా ముంపు గ్రామాల సమస్యలను పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఓటు అడిగారు. ఇప్పుడు అటువంటి రాజకీయ ప్రత్యర్థులు అల్లుడు కొడుకు ఒకటవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి టిఆర్‌ఎస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమైన ట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఫామ్ హౌస్ లో టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా రాజకీయాలు ఈ విధంగా ఉంటాయని ప్రజలు నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.




