23 June, 2026 | 11:02 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

బజాజ్ హౌసింగ్ నుంచి రూ.7,000 కోట్ల ఐపీవో

12-06-2024 12:30 AM

ముంబై, జూన్ 11: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.7,000 కోట్ల విలువైన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేసేందుకు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించింది. ఐపీవోలో రూ. 4,000 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేయాలని, మరో రూ.3,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో విక్రయిస్తారని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.  ఐపీవో ప్రతిపాదనకు ఇటీవలే కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. మార్కెట్ పరిస్థితులు, రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఐపీవోను జారీచేయనున్నట్టు పేర్కొంది. రూ.50,000 కోట్లకుపైబడి ఆస్తులు కలిగిన నాన్ ఫైనాన్స్ కంపెనీల జాబితాను 2022 సెప్టెంబర్‌లో ఆర్బీఐ ప్రకటించింది.  రెగ్యులేటర్ల మార్గదర్శకాల ప్రకారం ఆ జాబితాలో భాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2025 సెప్టెంబర్‌కల్లా స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ కావాల్సి ఉంటుంది.