ఎల్ అండ్ టీ టాప్ గెయినర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా లార్సన్ అండ్ టుబ్రో 1.64 శాతం లాభపడింది. టాటా మోటార్స్, మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీలు 1.5 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1 శాతంపైగా క్షీణించాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 1.93 శాతం ఎగిసింది. ఐటీ ఇండెక్స్ 3.38 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 3.33 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 2.53 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.84 శాతం, రియల్టీ ఇండెక్స్ 1.04 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.60 శాతం మేర పెరిగాయి. మెటల్, ఎఫ్‌ఎంసీసీ, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు తగ్గాయి.మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.74 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచి 0.95 శాతం ఎగిసింది.






