‘సివిల్ సప్లయ్’కు 7,366 కోట్లు
21-03-2026 02:05 AM
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): పేద ప్రజలకు తెల్లరేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు బడ్జెట్‌లోనూ కేటాయింపులు చేశారు. ఈసారి బడ్జెట్‌లో రూ.7,366 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.5,734 కోట్లు కేటాయించగా, ఈసారి అదనంగా రూ.1,632 కోట్లను కేటాయించింది. ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ.7,366 కోట్లకు గాను నిర్వహణ కింద రూ.115 కోట్లు, పథకాల అమలు కోసం రూ.7,366 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో రేషన్‌షాపుల ద్వారా 3.38 లక్షల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,5,7,879 రేషన్‌కార్డులు ఉన్నాయి.




