23 April, 2026 | 6:39 AM

న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు

12-05-2024 01:02 AM

త్వరలోనే నిధుల విడుదల చేస్తామన్న సీఎం

బార్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి త్వరలోనే రూ.100 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం బార్ అసోసియేషన్ ప్రతినిధులు తనను కలిసిన సందర్భంగా ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. న్యాయవాదుల వృత్తిపట్ల తనకు ఎంతో గౌరవముందని చెప్పారు. న్యాయవాదుల సంక్షే మానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆరోగ్య బీమాకు తగినన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సహకారం న్యాయవాదులందరికీ మేలు చేస్తుందని తెలిపారు. గతంతో పోలిస్తే న్యాయవాదుల సంఖ్య పెరిగిందని, అందుకు తగ్గట్లుగా న్యాయవాదుల సంక్షేమానికి తగినంత ఆర్థిక సాయం అందించాలని కోరడంతో త్వరలోనే నిధులు విడుదల చేస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.