02-11-2025 12:38:33 AM
నగర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగం
ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి) : అమృత్ 2.0 ప్రాజెక్టు నిధులకు సంబంధించి 573 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శనివారం పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధుల విడుదలలో ఎలాంటి త్రైమాసిక పరిమితులూ లేకుండా ట్రెజరరీ కంట్రోల్, క్వార్టర్లీ రెగ్యులేషన్ ఆర్డర్స్ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నిధులను నగర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇందులో ముఖ్యంగా నీటి సరఫరా, మురు గు నీటి వ్యవస్థ మెరుగుదల, గ్రీన్ స్పేస్‌లు, పార్కులు, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాల కల్పన, వరదల నిర్వహణను చేపట్ట నున్నారు. ఈ నిధులకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ సెక్రట రీని ఆదేశించారు.