30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

శ్రీశైలంలో భక్త జన సందోహం..!

15-02-2026 12:41 PM

నాగర్ కర్నూల్/శ్రీశైలం,(విజయక్రాంతి): శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా ఆదివారం తెల్లవారుజాము నుండి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవస్థాన అధికారులు దర్శన ఏర్పాట్లు, క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదం వంటి సదుపాయాలను సమకూర్చారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. భక్తులు సహనం పాటిస్తూ, అధికారుల సూచనలు అనుసరించాలని అధికారులు కోరుతున్నారు.