17 June, 2026 | 11:36 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ..

07-04-2026 12:00 AM

ఏర్పాట్లపై ఇంచార్జి ఈఓ పర్యవేక్షణ

వేములవాడ, ఏప్రిల్ 6,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇంచార్జి ఈఓ అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యతను పరిశీలించారు. అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న

వన్డే భోజన సదుపాయాన్ని తనిఖీ చేసి, భక్తులకు శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.అదనంగా నిత్య కళ్యాణం నిర్వహణ విధానం, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అవసరమైన చోట్ల మెరుగుదల చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఈఓ స్పష్టం చేశారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.