గ్రేట్ బాంబే సర్కస్‌లో సందర్శకుల సందడి
06-05-2024 02:12 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి) : సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన గ్రేట్ బాంబే సర్కస్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. పొద్దంతా మండే ఎండలకు అతలాకుతలమవుతున్న నగరవాసులు సాయంత్రం ఎంచక్కా గ్రేట్ బాంబే సర్కస్‌కు వెళ్లి తనివితీరా సేదతీరుతున్నారు. పైగా ఆదివారం కూడా కావడంతో పిల్లలతో పాటు పెద్దలు కూడా సర్కస్‌కు వచ్చారు. దీంతో జింఖానా గ్రౌండ్ సందర్శకులతో కిటకిటలాడింది.




