28 May, 2026 | 12:55 AM

ధోనీ ఏ పాత్రలో కొనసాగినా మాకిష్టమే

28-05-2026 12:11 AM

తుది నిర్ణయం అతనిదే

సీఎస్కే సీఈవో వ్యాఖ్యలు

చెన్నై, మే 27 : ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టిన కెప్టె న్ మహేంద్రసింగ్ ధోనీ. నిజం చెప్పాలంటే ధోనీ కారణంగానే సీఎస్కేకు అంత క్రేజ్ వచ్చింది. దానికి తగ్గట్టే ఐదుసార్లు టైటిల్ అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో కొనసాగుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అయితే గత రెండు సీజన్లుగా ధోనీ మునుపటి ఆట కనిపించడం లేదు. దీనికి తోడు చెన్నై కెప్టెన్సీని కూడా వదిలేయడంతో ఆటగాడిగా ఇదే చివరి సీజన్ అన్న మాట వినిపిస్తోంది.

దీనిపై ధోనీ ఇప్పటి వరకూ స్పందించకున్నా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో అభిమానులు ఒక అభిప్రాయానికొచ్చేశారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈ వో కాశీ విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ధోనీ వచ్చే సీజన్‌లో ఎలాంటి పాత్రలో కనిపించినా త మకు ఇష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆ నిర్ణయం పూర్తిగా అతని ఇష్టానికే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. ధోనీ ప్లేయర్‌గా ఉంటాడా, కోచ్‌గా మారతాడా లేక మెంటార్‌గా సేవలందిస్తాడా అనేది పూర్తిగా తన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని తేల్చేశారు.

దీనిపై ధోనీ ఎలాంటి నిర్ణయం తీసు కున్నా గౌరవిస్తామని చెప్పారు. దీంతో ధోనీ సీఎస్కే సపోర్టింగ్ స్టాఫ్‌లో కనిపించడం ఖాయమైందని భావిస్తున్నారు. ధోనీ తన రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే ఈ సీజన్ ఆరంభంలో గాయం కారణంగా తప్పుకున్నాడు. తర్వాత నెట్ ప్రాక్టీస్ లో కనిపించినా ఫిట్‌నెస్ లేకపోవడంతో తుది జట్టులో ఆడలేదు. చెపాక్‌లో చెన్నై చివ రి మ్యాచ్‌లో ఆడతాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూసినా నిరాశే మిగిలింది.

దీంతో ఆటగా డిగా ధోనీ శకం ముగిసినట్టేనని చాలా మం ది మాజీలు వ్యాఖ్యానించారు. ఇప్పుడు సీఎ స్కే సీఈవో సైతం చేసిన వ్యాఖ్యలతో ధోనీ భవిష్యత్తుపై సస్పెన్స్ వీడినట్టేనని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే చెన్నై ఈ సీజన్‌లోనూ నిరాశపరిచింది. ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. 14 మ్యాచ్‌లలో కేవలం ఆరిం ట గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పరిమితమైంది.