28 May, 2026 | 1:03 AM

రంజీ ట్రోఫీని ఆపేయండి

28-05-2026 12:08 AM

సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం

నబీకి ప్లేస్ లేకపోవడంపై ఫైర్

ముంబై, మే 27 : భారత జాతీయ జట్టులోకి ఎంపికయ్యేందుకు దేశవాళీ క్రికెట్‌నే కొ లమానంగా తీసుకుంటారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత దీనిలో కాస్త మార్పు వచ్చి నా టెస్ట్ ఫార్మాట్‌కు వచ్చేసరికి రంజీ ట్రోఫీ ప్రదర్శనను పరిగణిస్తారు. అయితే గత కొం తకా లంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. దేశవాళీ ప్రదర్శనను ప ట్టించుకోవడం లేదన్న విమర్శ వినిపిస్తోంది.

వచ్చే నెలలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకై క టెస్టు, వన్డే సిరీస్‌లకు ఇటీవలే భారత జ ట్టును ప్రకటించారు. అయితే టెస్టు మ్యాచ్ కోసం ఎంపిక చేసిన జట్టులో జ మ్మూ కాశ్మీ ర్ పేసర్ ఆకిబ్ నబీ పేరు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రంజీ ట్రో ఫీ 2025 సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి నన బీని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుపడుతున్నారు.

కనీసం శ్రీలంక-ఎతో జరగనున్న సిరీ స్‌లకు సైతం నబీని సెలక్టర్లు పట్టించుకోలేదు. ఆకిబ్ నబీ బదులుగా పం జాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్‌ను సెలక్టర్లు ఎం పిక చేశారు. తాజాగా ఇదే విషయంపై భార త మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది కేవలం నబీకి మాత్రమే జరిగిన అన్యాయం కాదనీ, రంజీ ట్రోఫీకి ఆస్తిత్వానికి జరిగిన అవమానంగా పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అగ్రస్ధానంలో ఉన్న బౌలర్ ఎంపిక చేయనప్పుడు రంజీ ట్రోఫీని నిర్వహిణను ఆపేయాలన్నాడు.