రాణాపై సస్పెన్షన్
కోల్‌కతా: ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఆనందంలో ఉన్న కోల్‌కతాకు షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ హర్షిత్ రాణాపై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు వంద శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ మంగళవారం పేర్కొంది. ఢిల్లీ బ్యాటర్ అభిషేక్ పొరేల్ వికెట్ తీసిన హర్షిత్ పెవిలియన్‌కు వెళ్లాలంటూ ప్లుయింగ్ కిస్ ఇచ్చే ప్రయత్నం చేసి తర్వాత విరమించుకున్నాడు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద ఆర్టికల్ 2.5 లెవెల్ 1ను అధిగమించినందుకు హర్షిత్ రాణాపై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. లీగ్ ఆరంభంలో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌కు.. హర్షిత్ ఇదే తరహాలో ప్లుయింగ్ కిస్ ఇచ్చాడు. అప్పుడు మొదటి తప్పు కింద హెచ్చరించిన రిఫరీ హర్షిత్ మ్యాచ్ ఫీజులో 60శాతం జరిమానా విధించాడు.






