24 June, 2026 | 10:10 PM

చివరి ఓవర్లో గెలిచిన కేకేఆర్… హీరోగా రింకూ!

20-04-2026 12:56 AM

రింకూ అద్భుత పోరాటం

రాజస్థాన్ రాయల్స్‌పై  విజయం

హమ్మయ్య ఎట్టకేలకు కోల్‌కతా నైట్ రైడర్స్ పరాజయాల పరంపరకు బ్రేక్ పడింది. రాజస్థాన్ రాయల్స్‌పై రింకూ సింగ్ అద్భుత పోరాటంతో తొలి విజయాన్ని అందుకుంది. లక్ష్యం భారీగా లేకున్నా మరోసారి కోల్‌కతా కీలక బ్యాటర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఉత్కం ఠగా మారింది. చివరికి రింకూ, అంకుల్ రాయ్ పోరాటంతో ఆఖరి ఓవర్లో గట్టెక్కింది. చాలా రోజుల తర్వాత రింకూ సింగ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం కేకేఆర్‌కు ఊరటనిచ్చింది  

కోల్‌కతా, ఏప్రిల్ 19: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. కానీ వైభవ్ 28 బంతుల్లో 46 (6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. కాసేపటికే జురెల్ (5), జైస్వాల్ (39) పరుగులకు ఔటయ్యారు.

IPL 2026 తాజా వార్తలు, స్కోర్‌కార్డులు అన్నీ ఒకే చోట చదవాలంటే మా హోంపేజ్ విజిట్ చేయండి.

ఇక్కడ నుంచీ రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులకే పరిమితమైంది.  స్పిన్ పిచ్ కావడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛేజింగ్ అంత సా ఫీగా సాగలేదు. తొలి బంతికే సిఫర్ట్ డకౌవగా.. పవర్ ప్లే లోనే ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. రఘువంశీ (10), పావెల్ (23), రమణ్ దీప్ సిం గ్ (10) కూడా ఔటవడంతో కోల్ కతా మ్యాచ్ గెలవడం కష్టంగానే కనిపించింది. ఫామ్ లో లేని రింకూసింగ్, టె యిలెండర్ అంకుల్ రాయ్ అద్భుతంగా చేశారు.

IPL 2026 అన్ని జట్ల తాజా పరిస్థితి, మ్యాచ్ రిజల్ట్స్ కోసం మా క్రికెట్ న్యూస్ పేజీ చూడండి.

వీరోచిత పోరాటంతో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చేశారు. వీరి ద్దరూ 37 బంతుల్లోనే 76 పరుగుల అజేయ భాగస్వా మ్యం నెలకొల్పారు. నిజానికి రింకూ సింగ్ ఇచ్చిన క్యా చ్‌ను ఫెరీరా జారవిడవడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పొ చ్చు. చాలారోజుల తర్వాత రిం కూ సింగ్ తనదైన బ్యాటింగ్‌తో అలరించాడు. రింకూ సింగ్ 34 బంతుల్లో 53 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) నాటౌట్, అంకుల్ రాయ్ 16 బంతుల్లో 29 (1 ఫోర్ , 2 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచారు. దీంతో సీజన్ తొలి విజయాన్ని అందుకున్న కోల్ కతా పాయిం ట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరింది.

స్కోరు బోర్డు

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 155/9 ( వైభవ్ 46, జైస్వాల్ 39, హెట్‌మెయిర్ 15 ; వరుణ్ చక్రవర్తి 3/14, కార్తీక్ త్యాగి 3/22, నరైన్ 2/26)

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 161/6 ( రింకూ సింగ్ 53, అంకుల్ రాయ్ 29, గ్రీన్ 27 ; జడేజా 2/8, బర్గర్ 1/20, ఆర్చర్ 1/35)

FAQs


1. KKR vs RR మ్యాచ్‌లో ఎవరు గెలిచారు?

కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి ఓవర్లో థ్రిల్లింగ్‌గా గెలిచింది.


2. రింకూ సింగ్ ఎన్ని పరుగులు చేశాడు?

రింకూ సింగ్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయం అందించాడు.


3. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏమిటి?

రింకూ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ వదిలేయడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది.


4. KKR ఈ సీజన్‌లో ఎన్ని మ్యాచ్‌లు గెలిచింది?

ఈ మ్యాచ్‌తో KKR ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.


5. RR స్కోర్ ఎంత?

రాజస్థాన్ రాయల్స్ 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


6. KKR టాప్ స్కోరర్లు ఎవరు?

రింకూ సింగ్, అంకుల్ రాయ్ కీలక పాత్ర పోషించారు.


7. ఈ మ్యాచ్ ఎందుకు హైలైట్ అయింది?

చివరి ఓవర్లో థ్రిల్, రింకూ ఫినిషింగ్ వల్ల మ్యాచ్ హైలైట్ అయింది.


8. IPL 2026లో KKR స్థానం ఏమిటి?

ఈ విజయంతో KKR పాయింట్స్ టేబుల్‌లో మెరుగైన స్థానం సాధించింది.


9. RR బ్యాటింగ్ ఎందుకు ఫెయిల్ అయింది?

మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడం ప్రధాన కారణం.


10. KKR తదుపరి మ్యాచ్ ఎప్పుడు?

తదుపరి మ్యాచ్ షెడ్యూల్ అధికారిక IPL అప్‌డేట్‌లో చూడాలి.


ఇవి కూడా చదవండి:

20 నుంచి టీసీఏ ఆల్‌స్టార్ టీ20 సూపర్ లీగ్

ఐపీఎల్ నుంచి ఖలీల్ అహ్మద్ ఔట్

RCB vs LSG: విరాట్ కోహ్లీ దుమ్మురేపగా బెంగళూరు ఘన విజయం

MI vs PBKS 2026: రోహిత్ ఆడతాడా? ముంబై ఒత్తిడిలో నేడు కీలక పోరు

KKR కష్టాలు మరింత పెరిగాయి: రహానేపై రూ.12 లక్షల జరిమానా, పాయింట్ల పట్టికలో అట్టడుగున

సిక్సర్ల సునామీ! పంజాబ్ 254 రన్స్ దంచికొట్టి లక్నోను చిత్తు

ముంబై గెలుపు బాట పట్టేనా?

తప్పుడు ఆరోపణలను ఖండించిన హెచ్‌సీఏ

డికాక్ సెంచరీ వృథా… పంజాబ్ దంచికొట్టింది!

పంజాబ్ ధనాధన్

సెమీఫైనల్లో పంజాబ్, విదర్భ

పంజాబ్‌కు ఎదురుందా?