SRH vs DC: సన్‌రైజర్స్ హ్యాట్రిక్ కొట్టేనా?
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్
ఈ మ్యాచ్‌కూ కమిన్స్ దూరం
ఉప్పల్‌లో మళ్లీ పరుగుల వరదే
హైదరాబాద్: Sunrisers Hyderabad మరియు Delhi Capitals మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. SRH vs DC మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయం అని అంచనాలు ఉన్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 20 : ఐపీఎల్ 19వ సీజన్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. హోంగ్రౌం డ్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడబోతోంది. రాజస్థాన్ రాయ ల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై అదిరిపోయే విజయాలు సాధించిన సన్‌రైజర్స్ ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది.
గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. గెలుపు కష్టమే అనుకున్న దశలో బౌ లర్లు మ్యాజిక్ చేసారు. ఈ విజయంతో పా యింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లిన ఆరెంజ్ ఆర్మీ ఫేవరెట్‌గా బరిలోకి దిగు తోంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ కు అత్యంత నిలకడ గా రాణిస్తున్న క్లాసెన్ పైనే మరోసారి అంచనాలు నెలకొన్నాయి.
IPL, క్రికెట్ అప్డేట్స్ కోసం స్పోర్ట్స్ కేటగిరీని చూడండి
అటు బౌలింగ్‌లో మా త్రం సన్ రైజర్స్ అదరగొడుతోంది. అసలు బౌలింగే లేదు అన్న అభిప్రాయం మారిపోయేలా గత రెండు మ్యాచ్‌లలో బౌలర్లే గెలిపించారు. యువ పేసర్లు ప్రపుల్ హిం గే, హొస్సేన్ కీలకంగా మారిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్‌పై భారీగా పరుగులు ఇచ్చినా ప్రఫుల్ చివర్లో గెలిపించాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు పరాజయాల తర్వాత అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి గెలుపు తమ సత్తా నిరూపించుకుంది.
ఢిల్లీ బౌలర్లు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ను కట్టడి చేయడం ఆకట్టుకుంది. అలాగే కేఎల్ రాహుల్, స్టబ్స్ ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి గొప్ప రిలీఫ్. ఎం దుకంటే ఈ సీజన్‌లో రాహుల్ పేలవ ఫా మ్‌తో నిరాశపరిచాడు. ఆర్సీబీపై తన రికార్డును నిలుపుకుంటూ చిన్నస్వామిలో దుమ్మురేపాడు. అటు స్టబ్స్ కూడా మ్యాన్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ కూడా ఫామ్ లోకి రావడంతో ఢిల్లీ కూడా ఫుల్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ టీ20 హిట్టర్లు ఉండడంతో ఉప్పల్‌లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.
తాజా IPL మ్యాచ్‌లు, స్పోర్ట్స్ న్యూస్ కోసం మా హోమ్‌పేజీని సందర్శించండి.
పిచ్ రిపోర్ట్
సాధారణంగా ఉప్పల్ స్టేడియం పూర్తిగా బ్యాటర్లకే అనుకూలిస్తుంటుంది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లకు గానూ రెండు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.
తుది జట్లు అంచనా
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ రెడ్డి, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సకీబ్ హొస్సేన్, మలింగ
ఢిల్లీ క్యాపిటల్స్ : నిస్సాంక, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, ఆకీబ్ నబీదార్, ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముకేశ్ కుమార్
FAQ's:
1. SRH vs DC మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
ఉప్పల్ స్టేడియం, హైదరాబాద్‌లో.
2. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ ఎవరు?
ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న SRH.
3. ఉప్పల్ పిచ్ ఎలా ఉంటుంది?
బ్యాటింగ్‌కు అనుకూలం.
4. SRH హ్యాట్రిక్ సాధిస్తుందా?
ఫామ్ చూస్తే అవకాశాలు ఉన్నాయి.
5. DC టీమ్ ఫామ్ ఎలా ఉంది?
కమ్‌బ్యాక్ చేసి మంచి ఫామ్‌లో ఉంది.
6. మ్యాచ్ హై స్కోరింగ్ అవుతుందా?
అవకాశాలు ఎక్కువ.
7. కీలక ప్లేయర్లు ఎవరు?
క్లాసెన్, రాహుల్, అక్షర్.
8. ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
ఈరోజు (match day context).






