15-10-2025 08:30:41 PM
చెట్లను నరికేసిన పట్టించుకోరా..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచిలి తండా గ్రామపంచాయతీ నందు పెద్ద ఎత్తున రోడ్డు ఇరువైపుల హరితహారం చెట్లు నరికివేతకు గురవుతున్న ఇటు పంచాయతీ అధికారులు అటు అటవీ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, స్థానికుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత స్థలాలలో పెరిగిన చెట్లను తొలగించడానికి అనుమతుల పేరుతో ఇబ్బందులు గురి చేసే అటవీ శాఖ అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పచ్చదనాన్ని పెంపొందించినందుకు ప్రభుత్వాలు ప్రజాధనం కోట్లాది రూపాయలు వెచ్చించి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఏరాది వానాకాలంలో ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ అధికారులు ప్రజాప్రతినిధులందరూ కలిసి హరితహారం మొక్కలు నాటారు పెంచిన చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు నరికేస్తున్న కనీసం చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు మొద్దు నిద్రలో పడిపోయారు. నాటిన హరితహారంలో నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది మొక్కలను రక్షణ లేకుండా పోయింది మొక్కలను అధికారులు గాలికి వదిలేయడంతో నేడు హరితహారం చెట్టు నరికి వేస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన హరితహారం ద్వారా నాటిన మొక్కలకు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు నిద్రమత్తులో వాటిని పట్టించుకోవడం లేదు. ఎలమంచిలి తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇటికల గడ్డ తండా కు వెళ్లే రోడ్డుపై హరితహారం చెట్లను నరికేశారు కానీ సంబంధిత అధికారులకు రోడ్డు పక్కన నరికేసిన హరితహారం చెట్టు మాత్రం కనిపించడం లేదని స్థానికులు ప్రయాణికులు మండిపడుతున్నారు.