calender_icon.png 15 October, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషణ లోపం లేని సమాజం కోసం కృషి చేయాలి..

15-10-2025 08:32:52 PM

జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి జి మల్లేశ్వరి..

చిట్యాల (విజయక్రాంతి): పోషణ లోపం లేని సమాజం కోసం అంగన్వాడీలు కృషి చేయాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి జి.మల్లేశ్వరి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని రైతు వేదికలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి జి మల్లేశ్వరి, మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డిలు మాట్లాడుతూ పోషకాహార లోపం సమాజాభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, బాలింతలు, చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ప్రాధాన్యతను వివరించాలన్నారు. ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు వంటి ఆహార పదార్థాల ద్వారా లభించే ప్రోటీన్స్, విటమిన్స్ ఖనిజ లవణాలు శరీర రక్షణకు అవసరమైనవని, వీటి గురించి ప్రతి ఇంటికి అవగాహన కల్పించాలన్నారు.

అలాగే పోషణలేని సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. బాలింతలకు సమతుల్య పోషకాహారం, అలాగే ప్రతి గర్భిణీలో రక్తహీనత లేకుండా ఐరన్ ప్రోటీన్స్, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ గర్భిణీ దశ నుండి డెలివరీ అయ్యేవరకు 10 నుండి 12 కేజీల బరువు పెరగాలని, తప్పనిసరిగా ఇమ్యూనైజేషన్ చేయించుకొని, విశ్రాంతి అదనంగా ఫీడింగ్ తీసుకోవాలన్నారు. కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు ఇందిరమ్మ అమృతంలో లోమిల్లెట్స్, పల్లిపట్టి(చిక్కీస్) 15 రోజులకొకసారి 15 పీసులు ఇవ్వడం జరుగుతుందని, కిశోర బాలికలు వాటిని తీసుకుని హిమోగ్లోబిన్ ను పెంచుకోవాలన్నారు. అలాగే వెయ్యి రోజుల ప్రాముఖ్యత, గర్భిణి దశ నుండి రెండు సంవత్సరాల వరకు తీసుకునే జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు వెన్నెల, రజిత, అశ్విని, అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.