15-10-2025 08:28:27 PM
చండూరు/నాంపల్లి (విజయక్రాంతి): సగర సంఘం నూతన కమిటీ నాంపల్లి మండల పరిధిలోని గానుగుపల్లి గ్రామంలో నూతన కమిటీని నల్లగొండ జిల్లా సగరసంఘం అధ్యక్షుడు నేర్ల కంటి రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బలుగూరి కరుణాకర్ ఆధ్వర్యంలో గానుగుపల్లి సగర సంఘం అధ్యక్షుడిగా నేర్లకంటి గోవర్ధన్ సాగర్, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు సాగర్, కోశాధికారిగా నేర్లకంటి ప్రవీణ్ సాగర్ తో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు నెర్ల కంటి గోవర్ధన్ సాగర్, ఆంజనేయులు మాట్లాడుతూ, వారి సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తానని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి రాములు సాగర్, లక్ష్మమ్మ సాగర్ తదితరులు పాల్గొన్నారు.