calender_icon.png 28 November, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుధ విరమణ.. తేదీ ప్రకటించిన మావోయిస్టు పార్టీ

28-11-2025 09:50:35 AM

మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన.. 

జనవరి 1న సాయుధ విరమణ..

అనంత్ పేరుతో ప్రకటన విడుదల..

న్యూఢిల్లీ: ఆయుధాలు వదిలిపెట్టి ప్రధాన స్రవంతి సమాజంలో చేరుతామని మావోయిస్టు పార్టీ(Maoist Party) సంచలనాత్మక ప్రకటన చేసింది. ఆయుధాల విరమణపై మావోయిస్టు పార్టీ తేదీని ప్రకటించింది. మావోయిస్టులు జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణ ప్రకటించారు. ఎంఎంసీ  జోన్ ప్రతినిధి అనంత్ ఒక అధికారిక లేఖను విడుదల చేశారు. ఒక్కొక్కరు కాకుండా అందరూ లొంగిపోవాలని నిర్ణయించినట్లు మావోయిస్టులు లేఖలో తెలిపారు.

కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్నీ నెంబర్ విడుదల చేశారు. అధిక ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వంతో వెళ్తామని మావోయిస్టులు వెల్లడించారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేస్తోంది. ఇటీవల కాలంలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. పలువురు మావోలు భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ లో మరణిస్తున్నారు. తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో హిడ్మా, అతని భార్యా రాజేతో పాటు పలువురు మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే.