calender_icon.png 28 November, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల స్వీకరణ కేంద్రాల ఖరారు

28-11-2025 09:52:57 AM

వలిగొండ,(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వలిగొండ మండలంలో రెండ రెండవ విడుతలో ఈనెల 30 నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. కాగా వలిగొండ మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిని క్లస్టర్ గా  విభజించి నామినేషన్లను స్వీకరించరున్నారు. వలిగొండ క్లస్టర్ లో వలిగొండ, లోతుకుంట, లింగరాజుపల్లి గ్రామాల నామినేషన్లను, నాతాళ్లగూడెం  క్లస్టర్ లో నాతాళ్లగూడెం, అక్కంపల్లి, మాందాపురం గ్రామాల నామినేషన్లను, టేకులసోమరం క్లస్టర్ లో టేకులసోమారం, ప్రొద్దుటూరు, ఎద్దుళ్లగూడెం గ్రామాల నామినేషన్లను, గొల్లపల్లి క్లస్టర్ లో గొల్లపల్లి, జాలుకాలువ, నెమలికాలువ, గ్రామాల నామినేషన్లను, వర్కట్ పల్లి క్లస్టర్ లో వర్కట్ పల్లి, సంగెం, గోకారం గ్రామాల నామినేషన్లను, పులిగిల్ల క్లస్టర్ లో పులిగిల్ల, సుంకిశాల, దాసిరెడ్డిగూడెం గ్రామాల నామినేషన్లను, వెలువర్తి క్లస్టర్ లో వెలువర్తి, కేర్చిపల్లి, మొగిలి పాక గ్రామాల నామినేషన్లను, ఆరూరు క్లస్టర్ లో అరూర్, ఎం. తుర్కపల్లి, జంగారెడ్డిపల్లి, నరసయ్య గూడెం గ్రామాల నామినేషన్లను, వేములకొండ క్లస్టర్ లో వేములకొండ, వెంకటాపురం, ముద్దాపురం, గురునాథ్ పల్లి గ్రామాల నామినేషన్లను, చిత్తాపురం క్లస్టర్ లో చిత్తాపురం, గోపరాజుపల్లి, దుప్పల్లి, నరసాపురం గ్రామాల నామినేషన్లను స్వీకరించనున్నారు.