15-11-2025 10:42:06 AM
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో(Betting App Promotion Case) ప్రముఖ సినీ నటుడు దగ్గుబాటి రానా(Daggubati Rana) శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఐడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. విచారణకు హాజరుకావాలని రానాకు సీఐడీ నోటీసులు పంపంది. అనధికారిక ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలకు సంబంధించి విచారణ కోసం నటుడు రానా ఆగస్టు 11 హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ముందు హాజరయ్యారు. ఇదే కేసులో ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ ను సీఐడీ ప్రశ్నించింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను(Vijay Deverakonda) క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) ప్రశ్నించిన ఒక రోజు తర్వాత, ఈ కేసుకు సంబంధించి బుధవారం మరో నటుడు ప్రకాష్ రాజ్‌ను సీఐడీ అధికారులు విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం చాలా మంది సినీ నటులు బెట్టింగ్ యాప్స్(Betting App Promotion)ను ప్రమోట్ చేస్తూ నెటిజన్లను ప్రభావితం చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, లక్ష్మీ మంచు వంటి నటులను విచారించి లావాదేవీల గురించి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న Taj0077, Fairplay.live, Andhra365, Vlbook, Telugu365, Yes365 వంటి బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై సీఐడీ దాడులు చేసింది. విదేశాలలో ఉంటున్న ప్రమోటర్లు నిరుద్యోగ యువతను యాప్‌లను ఆపరేట్ చేయడానికి నియమించుకున్నారు.